MDK: పాపన్నపేటకు చెందిన అర్జున్ రెడ్డి ఈరోజు విడుదలైన గ్రూప్-2 ఉద్యోగ నియామకాల్లో డిప్యూటీ తహసీల్దార్‌గా నియామకమయ్యారు. ప్రస్తుతం కలెక్టరేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గ్రూప్-2 ఫలితాల్లో రాష్ట్రస్థాయి 18వ ర్యాంకు సాధించారు. డిప్యూటీ తహసిల్దారుగా నియామకం కావడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.