TG: హైదరాబాద్కు చెరువులు, మూసీ నది గొప్పవరమని సీఎం రేవంత్ అన్నారు. చెరువులు, మూసీ నది కబ్జాకు గురై నగరానికి వరద సమస్య పెరిగిందని తెలిపారు. మూసీ పరివాహకంలోని ప్రజల పట్ల తనకు అవగాహన, సానుభూతి ఉన్నాయన్నారు. తను పేదలకు మేలు చేయాలనే భావిస్తా కానీ.. నష్టం చేసే వ్యక్తిని కాదని చెప్పారు. పేదల జీవితాల్లో మార్పు కోసం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.