BHPL: భూపాలపల్లి నియోజకవర్గం ప్రజలందరికీ MLA గండ్ర సత్యనారాయణరావు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని MLA క్యాంప్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.