సిరిసిల్ల పట్టణంలో ఆదివారం ధర్మ టీచర్ యూనియన్ ఆధ్వర్యంలో గుర్రం జాషువా 130వ జయంతి నిర్వహించారు. ధర్మ టీచర్ యూనియన్ జిల్లా కన్వీనర్ సంపతి రమేష్ మాట్లాడుతూ.. జాషువా లేవనెత్తిన కుల మత భేదాలు, సామాజిక అసమానతల జాడ్యం పోలేదన్నారు. చాప కింద నీరులా కొనసాగుతున్నాయని గుర్రం జాషువా కవిత మార్గం ఆలోచింపచేస్తుందన్నారు.