EG: రేబిస్ వ్యాధి పట్ల నిర్లక్ష్యం వహిస్తే అది ప్రాణాంతకమవుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.కే.వెంకటేశ్వరరావు హెచ్చరించారు. రాజమండ్రిలోని DMHO కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. జిల్లాలో కుక్కల కాటు కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. కుక్క కరిచిన వెంటనే వైద్యసాయం తీసుకుని రేబిస్ రాకుండా టీకాలు వేయించుకోవాలని ఆయన సూచించారు.