కోనసీమ: గోదావరి నదిలో వరద ఉదృతి పెరగడంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను కలిపే సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి లంక – నరసాపురం రేవులో పంటు ప్రయాణాలను అధికారులు నిలిపివేశారు. దీంతో రేవు వద్ద ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లే ప్రయాణికులు చించినాడ బ్రిడ్జి మీదుగా రాకపోకలు కొనసాగించారు.