దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ‘కాంతార’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు వచ్చి ఉంటే బాగుండేది అని జూ. ఎన్టీఆర్ అన్నారు. అభిమానులంతా థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని కోరారు. అందరూ ఇంటికి జాగ్రత్తగా తిరిగి వెళ్లండి అని సూచించారు. అభిమానులందరికీ ముందుగానే విజయదశమి శుభాకాంక్షలు చెప్పారు. కాంతారను విజయం వైపు తీసుకెళ్లాలని కోరుకుంటున్నానని అన్నారు.