TG: HYDలోని అంబర్పేటలో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(STP)ను సీఎం రేవంత్ ప్రారంభించారు. దీంతోపాటు రూ.3,849.10 కోట్ల అంచనా వ్యయంతో నగరంలో మరో 39 STPల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీటిలో రూ.1,878.55 కోట్లతో 16 STPలు, రూ.1,906.44 కోట్లతో 22 STPలు, అలాగే రూ.64.11 కోట్లతో ఒక STPని పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్(PPP) మోడల్లో నిర్మించనున్నారు.