NLG: శ్రామిక మహిళలు తమ హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని శ్రామిక మహిళ రాష్ట్ర కన్వీనర్ ఎస్వి.రమా పిలుపునిచ్చారు. ఆదివారం శ్రామిక మహిళ జిల్లా సదస్సు కట్టంగూరులో భూలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. సమాజ సంపద సృష్టిలో శ్రామిక మహిళలు గణనీయమైన పాత్ర నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.