NLG: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబరు 2న హాలియా పట్టణ పరిధిలో మాంసం విక్రయాలను నిషేధించినట్లు మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలోని మాంసం విక్రయదారులకు నోటీసులు అందించామని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.