NDL: అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా నవరాత్రోత్సవాలు నేత్రానంద భరితంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడవ రోజు (ఆదివారం) భ్రమరాంబాదేవి ఉత్సవ మూర్తిని కాళరాత్రి స్వరూపంలో అలంకరించారు. స్వామి అమ్మవార్లను గజ వాహనంపై ఆసీనులను ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.