KNR: జిల్లాలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి ఓ ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందనే వాతావరణ శాఖ సూచనలు, జిల్లాలోని పలు చోట్ల సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్న సందర్భంగా ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు గమనించి ప్రజావాణికి రావద్దని సూచించారు.