KKD: సామర్లకోటలో రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్న పశువులతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు వ్యక్తులు పశువులను రోడ్లపై వదలడమే ఇందుకు కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారుతోందని, తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.