NDL: సంజామల మండలం మంగపల్లెలో ఇవాళ నిర్వహించిన 60వ ఉచిత వైద్య శిబిరం విజయవంతమైనట్లు SSGRBCC ఛైర్మన్ డా.పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి తెలిపారు. ఈ శిబిరం ద్వారా 1,300 మంది ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. అనారోగ్య సమస్యలున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పుట్టిన ఊరికి సేవ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా పేర్కొన్నారు.