MDK: రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతిరెడ్డి పర్యటించారు. ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.