NLR: తెలుగు భారతి సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహించే మంచిమాట కార్యక్రమంలో భాగంగా నేడు ‘జీవిత సరిగమలు’ అనే అంశంను విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు సోమవరపు యానాదిరెడ్డి వివరించారు. జీవితం ఒక అద్భుతమైన సంగీతం లాంటిది. సంగీతంలో సరిగమలు ఉన్నట్లే, జీవితంలో కూడా సుఖ దుఃఖాలు ఉంటాయి. ఇవన్నీ కలిసినప్పుడే జీవితం సంపూర్ణమవుతుంది. జీవితంలో ప్రతి అనుభవం ఒక పాఠం అన్నారు.