ATP: గుత్తి మండలం జక్కలచెరువు గ్రామ సమీపంలో ఆదివారం పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. సీఐ రామారావు మాట్లాడుతూ.. పేకాట ఆడుతున్నారని తమకు రాబడిన సమాచారంతో తమ సిబ్బందితో కలిసి దాడులు చేశామన్నారు. 7మంది పేకాట రాయుళ్లలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.39వేల నగదు 4 బైకులను స్వాధీనం చేసుకుని సీజ్ చేసామన్నారు.