SS: జిల్లా SP సతీశ్ కుమార్ కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళలు, బాలికలపై నేరాలకు చెక్ పెట్టేందుకు కౌన్సిలింగ్ పద్ధతిని ప్రారంభించారు. ప్రతి ఆదివారం నేరస్తులు, రౌడీషీటర్లకు జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. అందులో భాగంగా నేడు కౌన్సిలింగ్ ఇచ్చారు. వేధింపులు, అసభ్య ప్రవర్తనపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.