TPT: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కడు రమణీయంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి మోహిని అలంకరణలో పల్లకిపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తకోటికి అభయమిచ్చారు. ఈ పల్లకి సేవలో తుడా ఛైర్మన్, టీటీడీ బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.