E.G: జిల్లా కలెక్టరేట్, డివిజన్, మండల స్థాయిల్లో ‘మీ కోసం కార్యక్రమం’ ఈనెల 29వ తేదీ సోమవారం యధావిధిగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలు, అభ్యర్థనలు meekosam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. నమోదు చేసిన అర్జీల స్థితి కోసం 1100 నంబరుకు కాల్ చేయవచ్చన్నారు.