ASF: పెంచికల్ పేట్ మండలం చేడ్వాయి రైతు వేదికలో సిర్పూర్ MLA డా. పాల్వాయి హరీష్ బాబు యూరియా పంపిణీ సరళిని ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 444 యూరియా బస్తాల పంపిణీ జరుగుతోందని తెలిపారు. రైతులు తమ AEOలను సంప్రదించి టోకెన్లు పొందితే మిగిలిన వారికి కూడా యూరియా పంపిణీ చేయబడుతుందని ఆయన స్పష్టం చేశారు.