VKB: దోమ మండలంలోని పలు గ్రామాలలో ఆదివారం పరిగి MLA రామ్మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. బొంపల్లి గ్రామంలో రూ.14 లక్షల వ్యయంతో నిర్మించిన CC రోడ్లను, బాస్పల్లి గ్రామంలో రూ. 14లక్షల వ్యయంతో నిర్మించిన CC రోడ్లను ప్రారంభించారు. అనంతరం గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కొత్త బోరు వేయించారు.