W.G: బలుసులమ్మ ఆశీస్సులతో జాతరను ఉత్సవంలా నిర్వహిస్తామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ బలుసులమ్మ వారిని దర్శించుకుని పూజలు చేశారు. జాతర ఉత్సవంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అమ్మవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలన్నారు. ఇందులో ఈవో చంద్రశేఖర్, ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజి పాల్గొన్నారు.