KRNL: హలహర్వి మండలంలో కలుషిత నీటి సమస్యపై ఆర్డబ్ల్యూఎస్ జేఈ స్పందించారు. ఇవాళ మల్లికార్జున పల్లిలో కలుషిత నీటి కుంటను పరిశీలించారు. జడ్పీటీసీ లింగప్ప, సర్పంచ్ బాలరాజుతో కలిసి తాగునీటి సమస్య పరిష్కారానికి చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వాటర్ సంపు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.