MBNR: కొత్తచెరువు రోడ్డులోని శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. అర్చకులు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దుర్గామాత మండపాలను ఎమ్మెల్యే దర్శించుకుని అమ్మవారికి పూజలు చేశారు. దేవి ఆశీస్సులు అందరిపై సంపూర్ణంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.