SKLM: వంశధార జలాల సాధనకు ఐకమత్యంగా కృషి జరపాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఆదివారం హరిపురం మార్పు గ్రంథాలయంలో వంశధార సాగునీరు సాధన కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయా సంఘ నాయకులు మాట్లాడుతూ.. పోస్ట్ కార్డు ఉద్యమం, గ్రామ పంచాయితీల తీర్మానాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ప్రభుత్వాలు రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.