SKLM: జలుమూరు (M)లో ఉన్న శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 29వ తేదీన హుండీ లెక్కిస్తున్నట్లు ఆలయ ఈవో టి. వాసుదేవరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం జరిగే హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న భక్తులు డ్రెస్ కోడ్ పాటించి రావాలని సూచించారు. ఆలయ అర్చకులు,భక్తుల సమక్షంలో హుండీ లెక్కింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.