SS: అమరావతి RRR కన్వెన్షన్ సెంటర్లో కురుబ, కురుమ, కురువ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సవిత పాల్గొన్నారు. కురుబలు ఐకమత్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, విద్యతోనే పేదరికం తొలగుతుందని తెలిపారు. కురుబలు అన్ని రంగాల్లో ఉన్నతి సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, కురుబ సంఘం నాయకులు పాల్గొన్నారు.