VSP: విశాఖలోని కురుపాం మార్కెట్లో ఉన్న 148 ఏళ్ల చరిత్ర గల కన్యకాపరమేశ్వరి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు ఆదివారం అమ్మవారు త్రిశక్తిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 108 రకాల ద్రవ్యాలతో మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం నిర్వహించిన అనంతరం, వివిధ రకాల పూలతో అమ్మవారిని త్రిశక్తిదేవి రూపంలో సుందరంగా అలంకరించారు.