BDK: అంతర్జాతీయ సంజ్ఞ భాష దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఈ వేడుకలు ఆదివారం నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. అర్హులైన బధిరులకు సహాయ ఉపకరణాలను అందజేస్తామని స్వర్ణలత తెలిపారు. సమాజంలో బధిరులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించి, విద్య, ఉద్యోగాలలో వారికి న్యాయం చేస్తామన్నారు.