W.G: భీమవరం ప్రత్యేక ఉప కారాగారాన్ని ఆదివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి, సంస్థ సెక్రటరీ రత్న ప్రసాద్ సందర్శించారు. ముద్దాయిలకు న్యాయవాదులు ఉన్నారా, న్యాయవాదులను పెట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోతే మండల న్యాయ సేవా సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామన్నారు. ముద్దాయిలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు.