GNTR: అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు రవణం స్వామినాయుడు అమ్మవారి దీక్షలో భాగంగా ఆదివారం పొన్నూరులోని దేవాలయాలను దర్శించారు. దశావతారం విష్ణు ఆలయం, సహస్ర లింగేశ్వర స్వామి, వీరాంజనేయ స్వామి ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు మేకల రవీంద్రబాబు పాల్గొన్నారు.