CTR: మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి బుల్లితెరపై తళుక్కుమన్నారు. ఇందులో భాగంగా దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి అవతారంలో కనిపించారు. ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్ నిర్వహించిన దసరా ఈవెంట్లో దుర్గాదేవి గెటప్‌లో ఓ పాటకు పర్ఫార్మ్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను ఆవిడ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. అనంతరం తెలుగు ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.