అన్నమయ్య: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ శ్రేణులు ట్రోల్ చేయడం సిగ్గుచేటు అని టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్ జె వెంకటేష్ ఆరోపించారు. ఇవాళ మదనపల్లెతో మాట్లాడుతూ.. చిరంజీవిని ఏదో అనేశారంటూ వైసీపీ శ్రేణులు పోస్టులు పెట్టడంపై మండిపడ్డారు. అనంతరం కూటమి నుండి కాపులను దూరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.