జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చందయ్యపల్లెలోని హనుమాన్ ఆలయ ఆవరణలో నెలకొల్పిన దుర్గమాత అమ్మవారిని వరంగల్ జిల్లా డీఎస్పీ కే. రమేష్ ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వరంగల్ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న రమేష్, పూజారి మదన్ మోహన్‌తో కలిసి అమ్మవారికి అర్చన చేసి, మొక్కులు చెల్లించారు.