E.G: ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన ‘మన్ కీ బాత్’ 126వ ఎపిసోడ్ ను బీజేపీ నాయకులు ఆదివారం వీక్షించారు. రాజమహేంద్రవరంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి నాయకులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ఆలకించారు. ఈ ప్రసంగంలో మోదీ దేశీయ ఆధ్యాత్మిక సామూహిక విలువలు, స్వదేశీ వస్తువుల ప్రోత్సాహం వంటి అంశాలపై ప్రధానంగా మాట్లాడారు.