SRPT: సినీ రంగంలో కోదాడ పేరును వ్యాపింప చేసిన నవ్వుల రారాజు వేణుమాధవ్ అని కోదాడ మాజీ సర్పంచ్ పారా సీతయ్య అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలో సాంస్కృతిక కళామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన, వేణుమాధవ్ జయంతిలో ఆయన పాల్గొని మాట్లాడారు.. సినీ కళా రంగాలకు వేణుమాధవ్ మృతి తీరని లోటని ఆయన అన్నారు.