KMM: సత్తుపల్లి మండలం రేజర్లలో శ్రీ సత్తెమ్మ తల్లి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ట, శ్రీ దుర్గా నాగ మల్లేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్ట రాగమయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. స్వామి వారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.