ATP: రామగిరి మండలంలో ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. బ్రహ్మకుమారీల ధ్యానం, ఆధ్యాత్మిక బోధనలు, సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. రాజయోగ ధ్యానం వ్యక్తిగత వికాసం, సామాజిక శ్రేయస్సుకు దోహదమని అన్నారు. ఇలాంటి కేంద్రాలు ప్రతి ప్రాంతంలో ఉండాలని ఆకాంక్షించారు.