BHPL: గోరికొత్తపల్లి మండలంలో రేపు పెద్ద బతుకమ్మ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడే స్థలంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పిచ్చి మొక్కలను ట్రాక్టర్ సహాయంతో తొలగిస్తూ స్థలాన్ని చదును చేస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో బతుకమ్మ వేడుకలను జరుపుకోవాలని అధికారులు సూచించారు. మండల ప్రజలు ఉత్సాహంగా పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.