VZM: విజయనగరంలోని కాశీపతిరావు స్మారక భవనంలో నందివాడ చిన్నాదేవి రచించిన ‘వెన్నెల పాట‘ పుస్తక పరిచయసభ జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జి. వి. శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ప్రముఖ కవి మానాపురం రాజా చంద్ర శేఖర్ పుస్తక సమీక్ష చేశారు. తన చుట్టూ ఉన్న సమాజమే తన కవితలకు ప్రేరణ అని కవయిత్రి చిన్నా దేవి చెప్పారు.