E.G: సమసమాజ నిర్మాణ స్ఫూర్తి ప్రదాత మహాకవి గుర్రం జాషువా జయంతి వేడుకలు ఆదివారం రాజమండ్రి కలెక్టరేట్లో శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేశ్ హాజరై, జాషువా చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. తెలుగు సాహితీ లోకంలో ఆయన చిరస్మరణీయుడని మంత్రి దుర్గేశ్ కొనియాడారు.