MBNR: రాష్ట్రంలో క్రీడల అభివృద్దికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మహబూబ్ నగర్‌ను స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చేసుకోవల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. జిల్లాలో ఉన్న క్రీడా ప్రేమికులు ఏ క్రీడలను ఎంచుకున్న వారిని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.