కోనసీమ: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రాపురం మండలం వెల్ల నుంచి ఉండూరు వంతెన వరకు రూ. 3 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రోడ్డు అభివృద్ధి పనులను ఆదివారం ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు.