MNCL: ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ తీసుకువచ్చిన నూతన జీఎస్టీ తగ్గింపులను కొనుదారులకు అందించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. జీఎస్టీ బచత్ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం లక్షెట్టిపెట్ పట్టణంలో వారు ఎలక్ట్రానిక్ షాపులను పరిశీలించి వ్యాపారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.