ADB: తాంసి మండలంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం మండలంలోని కప్పర్ల గ్రామంలో ప్రతిష్టించిన దుర్గామాతకు గ్రామస్తులు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కుంకుమ అర్చన, తదితర కార్యక్రమాలను నిర్వహించినట్టు తెలిపారు. ఈరోజు అమ్మవారు మహా చండి దేవిగా అవతారంలో దర్శనం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.