KNR: ప్రఖ్యాత సాహితీవేత్త, అవధాని దత్తయ్య శర్మ శివైక్యం చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం కరీంనగర్లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ.. తుది శ్వాస విడిచారు. దత్తయ్య ఆకస్మిక మరణ వార్త హుజురాబాద్ ప్రాంత సాహితీ లోకాన్ని, ఆయన అభిమానులను, ఆప్తులను, కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో నెట్టివేసింది.