అన్నమయ్య: దసరా శరన్నవరాత్రి వేడుకలు మదనపల్లె పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం నందు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ భువనేశ్వరీ దేవి అలంకారంలో వాసవి అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇందులో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు. కాగా అధ్యక్షులు ఓం ప్రకాష్ అమ్మవారి దర్శనార్థం భక్తులకు తగు ఏర్పాటు చేశారు.