SKLM: ఎర్రన్న విద్యా సంకల్పం కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలో RRB గ్రూప్–డి అభ్యర్థుల కోసం కంప్యూటర్ ఆధారిత మాక్ టెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ విషయం గురించి శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సుమారు 300 మంది యువత ఈ పరీక్షలో పాల్గొన్నట్లు తెలిపారు.