NLG: గుర్రంపోడు మండలం కొప్పోలులో విషాదం నెలకొంది. పొలానికి నీరు పెట్టే యత్నంలో విద్యుదాఘాతానికి గురై ఓ యువ రైతు ప్రాణాలు విడిచాడు. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బొంగరాల సతీశ్ (26) తన రెండు ఎకరాల పొలంలో వరి సాగుచేస్తున్నాడు. ఇవాళ పంటకు నీరు పెట్టేందుకు వ్యవసాయ మోటార్‌ను ఆన్ చేయబోగా ప్రమాదావశాత్తు విద్యుత్ షాక్ తగలి అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు.